ఆయన గురించి ఇక ప్రస్తావించను: శ్రీ రెడ్డి

Friday, April 27th, 2018, 08:07:21 PM IST

క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో మీడియా ముందుకు వచ్చి పాపులర్ అయిన శ్రీ రెడ్డి ఆ తరువాత పవన్ కళ్యాణ్ వివాదంతో సైలెంట్ అయిపొయింది. ఎక్కువగా మీడియా ముందుకు రావడం లేదు. అయితే సోషల్ మీడియా వేదికగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయడంతో అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో శ్రీ రెడ్డి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వివరించింది. ఇప్పటి నుంచి తాను చేసే ప్రతి పోస్ట్ లకు, పీకేకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని అందరు గ్రహించాలని వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాట్లు కామెంట్ పెట్టారు శ్రీరెడ్డి. ‘ఫైనల్ గా పికే గురించి ప్రస్తావించడం ఆపేశాను. నేను ఇప్పటి నుంచి చేసే ప్రతి పోస్ట్ ను అనవసరంగా పీకేకు ఆపాదించవద్దని తెలుపుతూ మరో పోస్ట్ లో 5 కోట్ల రూపాయల అంశం గురించి ప్రస్తావించారు. చాలామంది మాట్లాడుకుంటున్న కారణంగానే ఈ పోస్ట్ చేస్తున్నా అంటూ.. మంచి వ్యక్తిగా జీవిస్తే చాలు. వెధవల దగ్గర నిరూపించుకోవాల్సిన పనిలేదు’ అనే కొటేషన్ ఉన్న ఫొటోను అప్ లోడ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments