విజయసాయిరెడ్డి కి మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ అల్లుడు

Saturday, October 19th, 2019, 04:07:35 PM IST

విజయసాయి రెడ్డి బాలకృష్ణ చిన్న అల్లుడైన శ్రీభరత్ పై చేసిన ఆరోపణలపై గాను రివర్స్ కౌంటర్ ఇచ్చారు భరత్. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల పై ఒక్కొక్కటిగా లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అంతే కాకుండా విజయసాయి చేసిన వ్యాఖ్యల పై నిరసన వ్యక్తం చేసారు. ఏపీ ట్రాన్స్కో నుండి రావాల్సిన బకాయిలు మూడు కోట్ల రూపాయలు. ఇప్పటివరకు లోన్ బకాయిలు వాయిదా మొత్తం రెండు కోట్ల రూపాయలు. ట్రాన్స్కో లు సరైన సమయం లో బకాయిలు చెల్లించి ఉంటే ఋణ వాయిదాలు మేము కూడా చెల్లించేవాళ్ళం. కానీ ఇపుడు చెల్లించే స్థితిలో లేమని తెలిసి ఇలా నిందలు వేయడం చాల విచారకరం అని అన్నారు.

విజయసాయిరెడ్డి కి మరొక విషయాన్నీ గుర్తు చేసారు శ్రీభరత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చాల మంది వ్యాపారస్తులకు బిల్లులు రాక, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కావున మీ సలహాలు రాష్ట్రానికి చాల అవసరం, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచివి కావని నా అభిప్రాయం అని అన్నారు. వైసీపీ నేతల ఆరోపణలు సహజమైనవే అయినప్పటికీ బాలకృష్ణ చిన్నల్లుడు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం తో వైసీపీ నేతలు మరోమారు ఏమని ప్రశ్నిస్తారో వేచి చూడాలి.