శ్రీ‌దేవిపై బోనీ అవిభాజ్య ప్రేమ‌

Sunday, June 3rd, 2018, 12:07:07 PM IST

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మ‌ర‌ణం ఇప్ప‌టికీ ఓ మిస్ట‌రీనే. దిల్లీకి చెందిన ఓ ఇన్వెస్టిగేష‌న్ సంస్థ ఈ త‌ర‌హా సందేహాన్ని వ్య‌క్తం చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఘ‌ట‌న‌పై పూర్తి ప‌రిశోధ‌న చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. ఆ క్ర‌మంలోనే బోనీపై జ‌నంలో ఏదో ఒక సందేహం. అయితే అన్నిటికీ ఇదిగో ఇదే స‌మాధానం అన్న చందంగా బోనీక‌పూర్ ప్ర‌తి సంద‌ర్భంలోనూ భార్య‌పై త‌న ప్రేమ‌ను బ‌హిరంగంగానే చూపిస్తున్నారు.

ఈరోజు 22 వ పెళ్లిరోజు.. నా జాన్ .. నా లైఫ్‌.. నా జీవిత‌భాగ‌స్వామి.. ప్రేమ‌, క‌రుణ‌.. ద‌య‌.. నా న‌వ్వు.. . నాలో జీవించే నా ఆత్మ‌.. ఎప్ప‌టికీ త‌నే అంటూ ఎంతో పోయెటిక్‌గా బోనీ ఈరోజు ఓ వీడియోని సామాజిక మాధ్య‌మాల్లో ట్వీట్ చేశాడు. నేడు బోనీ-శ్రీ‌దేవి జంట 22వ పెళ్లి రోజు సంద‌ర్భంగా అరుదైన వీడియోని పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో జోరుగా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.