న్యూయార్క్ సినిమా పండ‌గ‌లో శ్రీ‌దేవి సంస్మ‌ర‌ణ‌

Tuesday, March 20th, 2018, 07:35:39 PM IST

కేవ‌లం మూడు నెల‌ల వ్య‌వ‌థిలో ఇద్ద‌రు టాప్ స్టార్లు అంత‌ర్ధాన‌మ‌య్యారు. మేటి తార‌లు శ‌శిక‌పూర్‌, శ్రీ‌దేవి మ‌ర‌ణం అభిమానుల్ని శోక‌సంద్రంలో ముంచింది. శ‌శిక‌పూర్ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 4న మ‌ర‌ణించ‌గా, ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌దేవి ఆక‌స్మికంగా మ‌ర‌ణించారు. ఈ ఇద్ద‌రూ పాన్ ఇండియా స్టార్లు. దేశ, విదేశాల్లో అసాధార‌ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లు. వీళ్లు న‌టించిన ప‌లు చిత్రాలు విదేశాల్లో చ‌క్క‌ని ఆద‌ర‌ణ సంపాదించాయి. అందుకే ఆ ఇద్ద‌రికీ న్యూయార్క్ ఫిలింఫెస్టివ‌ల్‌లో సంతాప సంస్మ‌ర‌ణ స‌భ జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది.

శ‌శిక‌పూర్ న‌టించిన‌ షేక్‌స్పియ‌ర్ వాలా, హీట్ అండ్ డ‌స్ట్ చిత్రాల్ని, శ్రీ‌దేవి న‌టించిన `ఇంగ్లీష్ వింగ్లీష్‌` చిత్రాన్ని ఈ ఏడాది మే 7 నుంచి మే12 వ‌ర‌కూ ఐదు రోజుల పాటు సాగే న్యూయార్క్ ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శిస్తార‌ని తెలుస్తోంది. ఇక్క‌డే ఆ ఇద్దరికీ సంతాపం తెలియ‌జేసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డైంది.