వీడియో : శ్రీదేవి కూతురి కోసం ఎగబడ్డారు

Saturday, May 26th, 2018, 04:50:31 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కావాలంటే ఎవ్వరికైనా కొంచెం సమయం పడుతుంది. ఓ నాలుగైదు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందితే తప్ప స్టార్ హీరోయిన్ గా ఎదగలేరు. కానీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒక్క సినిమా కూడా తీయకముందే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటోంది. ఆమెకు సంబందించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గా ఆమె కలుసుకోవడానికి కొంత మంది ఎగబడ్డారు. అందులో పిల్లలు కూడా ఉన్నారు. ఓ విధంగా ఆమెకు ఇబ్బంది కలిగించినప్పటికీ నవ్వుతూనే వీలైనంత వరకు అభిమానులను కలుసుకుంది. ఆ తరువాత మెల్లగా తన బాడీ గార్డ్స్ సహాయంతో జాన్వీ కారు ఎక్కి వెళ్లిపోయింది. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం జాన్వీ తన మొదటి సినిమా దఢక్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments