శ్రీదేవి కూతురు అప్పుడే లెవెల్ చూపిస్తోంది!

Saturday, July 28th, 2018, 01:12:05 AM IST

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అంత ఈజీ కాదు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా గ్లామర్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటునే నటనలో కూడా రాటుదేలాలి. ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్తగా థింక్ చేస్తుండాలి. ఆ విషయంలో నేటితరం హీరోయిన్స్ చాలా చురుగ్గా ఉన్నారనే చెప్పాలి. ఇకపోతే రీసెంట్ గా ధఢఖ్ బ్యూటీ జాన్వీ కూడా అదే తరహాలో అందరిని ఆకట్టుకుంటోంది. ఇక అమ్మడి కాస్ట్యూమ్ స్టైల్ కూడా బయటకి వస్తే లక్షల్లో దాటుతోంది.

రీసెంట్ గా సింగపూర్ నుంచి వాస్తు ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగిన జాన్వీ ఖరీదైన దుస్తుల్లో కనిపించింది. ఆమె ధరించిన కాటన్ జెర్సీ ఖరీదు 33 వేల రూపాయలు. స్లీవ్‌తో ఉన్న సెయింట్ లారెంట్ బాయ్‌ఫ్రెండ్‌ టీ-షర్టు తో పాటు ఆమె వేసుకున్న షూ కూడా చాలా ఖైరిదైనవే. ఆ లెదర్‌ను కలిగి ఉన్న ఈ షూస్‌ విలువ 1.37 లక్షల రూపాయలని తెలుస్తోంది. స్పెయిన్‌కు చెందిన ఒక ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్‌ హౌజ్‌ బ్యాలెంసీ నుంచి కొనుగోలు చేశారు.మొదటి సినిమా అలా అయిపోయిందో లేదో అమ్మడు అప్పుడే చాలా కాస్ట్లీ దర్శనాలు ఇస్తోంది. మరి భవిష్యత్తులో ఇంకా ఏ రేంజ్ లో మెయింటైన్ చేస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments