టాలీవుడ్ లోకి శ్రీదేవి కూతురు.. నిర్మాతగా దిల్ రాజు ?

Wednesday, July 25th, 2018, 02:23:58 PM IST

అందాల సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరాఠీలో సంచలనం క్రియేట్ చేసిన సైరస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ధఢక్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ముక్యంగా జాన్వీ మంచి మార్కులు కొట్టేసింది. శ్రీదేవి కున్న క్రేజ్ ని ఇప్పుడు జాన్వీ అందుకుంటుంది. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడిని ఇప్పుడు తెలుగు, తమిళ బాషల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బోణి కపూర్ ఈ విషయంలో పలువురు స్టార్స్ తో చర్చలు జరుపుతున్నారని టాక్. తాజగా జాన్వీ ఎంట్రీ ఓ స్టార్ హీరో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందట, ఇప్పటికే ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments