అతిలోక సుందరి అందం ఏ మాత్రం తగ్గలేదుగా

Saturday, December 2nd, 2017, 05:03:37 PM IST

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన నటనతోనే కాకుండా అందంలోను ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ – కోలీవుడ్ లో శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె అందాన్ని పొగడని వారు లేరు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ లాంటి విలక్షణ దర్శకుడు శ్రీదేవిని ఎంతగా ఆరాధిస్తాడో అందరికి తెలిసిందే. అయితే శ్రీదేవి పెళ్లి చేసుకున్నాక కూడా ఏమి మారలేదు అనే కామెంట్స్ చాలా వినిపిస్తున్నాయి. 54 ఏళ్ల వయసులో కూడా శ్రీదేవి తన గ్లామర్ ని అలానే కాపాడుకుంటూ వస్తోంది.

అంతే కాకుండా బాలీవుడ్ కి సంబందించిన వేడుకలు ఎప్పుడు జరిగినా ఫ్యాషన్ దుస్తుల్లో కనిపిస్తూ.. కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తోంది. అయితే రీసెంట్ గా ముంబయి లో ఫిలిం ఫేర్ గ్లామర్ అవార్డులకు సంబందించిన ఓ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకి స్టార్ హీరోయిన్స్ కూడా వచ్చారు. అయితే వేడుకలో శ్రీదేవి మాత్రం అందరికంటే చాలా గ్లామర్ గా రెడీ అయ్యి వచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన వారందరు శ్రీదేవిని అలా చూస్తూ ఉండిపోయారు. ఆ డ్రెస్ లో శ్రీదేవి చాలా బావుందని ప్రశంసించారు కూడా.. ఇక సోషల్ మీడియాలో కూడా శ్రీదేవి ఫొటో పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments