దేవుఁడా .. శ్రీదేవి చిన్న కూతురు కూడానా ?

Wednesday, February 8th, 2017, 02:47:28 PM IST


అందాల తార శ్రీదేవి కూతుర్ల వ్యవహారం మహా రంజుమీదుంది. ఇప్పటికే పెద్దమ్మాయి జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేయాలనీ ప్లాన్ చేస్తుంటే .. జాహ్నవి మాత్రం ఘాటు ప్రేమాయణం మొదలు పెట్టి రెచ్చిపోయి అతగాడితో తిరుగుతూ నానా హంగామా చేస్తుంది. ఇక హీరోయిన్ గా పరిచయం అనే విషయం పక్కన పడింది. ఇప్పటికే జాహ్నవి విషయంతో తలలు పట్టుకుంటున్న శ్రీదేవి కి పెనం మీదనుండి పొయ్యిలో పడ్డట్టుగా మరో షాకింగ్ తగిలే విషయం తెలిసింది. ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ? అదేంటో తెలుసా శ్రీదేవి రెండో కూతురు ఖుషి కూడా ప్రేమాయణం మొదలు పెట్టింది ? ఇంతకీ ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నది ఎవరంటే నీల్ ధావన్ !! సినిమా కుటుంబం నుండి వచ్చిన నీల్ తో ఖుషి వ్యవహారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ అవుతున్నాయి. మరి ఈ అమ్మడి విషయం పై శ్రీదేవి ఎలా స్పందిస్తుందో చూడాలి !!