మళ్లీ తెరపైన నన్ను చూస్తారు. శ్రీహరి సతీమణి

Monday, April 16th, 2018, 03:39:34 PM IST

అప్పట్లో డ్యాన్సర్ గా ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి డిస్కో శాంతి. అయితే శ్రీహరి ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న తరువాత ఆమె సినిమాలను దూరం పెట్టేశారు. అయితే ఆయన మరణం శాంతిని ఎంతో మనోవేదనకు గురి చేసింది. అయితే ఇప్పుడిపుడే ఆమె బాధ నుంచి కోలుకుంటోంది. ఇక నటిగా కొనసాగే ప్రయత్నం ఆమె చేస్తున్నారని గత కొంత కాలంగా కొన్ని వార్తలు వచ్చాయి. మొదట అది రూమర్ అని అందరు అనుకున్నప్పటికీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డిస్కో శాంతి ఆ విషయంపై వివరణ ఇచ్చారు.

ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..ఇంతవరకూ సినిమాల కోసం ఎవరూ సంప్రదించలేదు, కానీ టాలీవుడ్ తెరపై మరోసారి నన్ను చూసే అవకాశాలు వున్నాయి. అయితే గుంపులో గోవింద అనేలా ఎదో పాత్రలు చేయడం ఇష్టం లేదు. అలాంటి అవసరం కూడా నాకు లేదు. కేవలం పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను. పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవారయ్యారు. ఇప్పుడే నటించాలని అనుకుంటున్నా. నటనలో బిజీ అయితే సినీ పరిశ్రమలో నలుగురిని కలుస్తూ ఉంటేనే బావుంటుంది. మనసుకు కాస్త ప్రశాంతత దొరుకుతుందని ఆమె తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments