మహేష్ దర్శకుడికి మళ్ళీ సినిమా దొరికిందిగా ?

Wednesday, September 19th, 2018, 01:00:07 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ” సీతమ్మ వాకిట్లో ..సిరిమల్లె చెట్టు” , ”బ్రహ్మోత్సవం” సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం తరువాత ఇంత వరకు ఏ సినిమా చేయలేదు. భారీ అంచనాల మధ్య బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వడంతో ఆయనతో సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు రాలేదు. అటు నిర్మాతల పరిస్థితి అలాగే ఉంది .. దాదాపు మూడేళ్లు గడుస్తున్నా కూడా ఇంకా అయన ప్రయత్నాల్లో ఉన్నాడు. మొత్తానికి ఇన్ని రోజులకు అయన ఓ సినిమా దొరికింది .. అదికూడా ప్రముఖ బ్యానర్ లో కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయడానికి యంగ్ హీరో శర్వానంద్ రెడీ అయ్యాడు .. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండడం విశేషం. తాజాగా జరిగిన చర్చలతో అల్లు అరవింద్ ఓకే చెప్పాడని .. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, దసరాకు ఈ సినిమాను లాంచ్ చేస్తారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.