మహేష్ దర్శకుడి సినిమాలో హీరోగా నాని ?

Thursday, September 20th, 2018, 10:41:03 AM IST

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. బ్రహ్మోత్సవం చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాల గ్యాప్ తరువాత మరో సినిమాతో వస్తున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. ముక్యంగా శ్రీకాంత్ అడ్డాల తో సినిమా చేయడానికి హీరోలందరూ ముఖం చాటేశారు. దాదాపు మూడేళ్ళ ప్రయత్నాల తరువాత అయనకు గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తాడని వార్తలు వచ్చాయి . కానీ ఈ సినిమాలో హీరో శర్వానంద్ కాదని .. నాని అని తెలిసింది. శ్రీకాంత్ ఇప్పటికే నానికి కథ చెప్పి ఓకే చేయించాడట. ఇప్పటికే స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.