ఇంతకీ … బ్రహ్మోత్సవం దర్శకుడు ఎం చేస్తున్నట్టు ?

Monday, February 27th, 2017, 03:20:13 PM IST


పరిశ్రమలో హిట్ ఒకటే కీలకం .. హిట్ వచ్చిందా అందలం ఎక్కిస్తారు .. ప్లాప్ కొట్టిందా అడ్డంగా తొక్కేస్తారు ? ఇక్కడ సక్సెస్ ఎవరినైనా సూపర్ స్టార్ గా నిలబెడుతుంది .. ప్రయత్నం బెడిసి కొట్టిందటే .. అడ్డంగా తొక్కిపడేస్తుంది… ఇప్పుడు అచ్చంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయంలో నిజమైంది. కొత్తబంగారు లోకం సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు మహేష్ బాబు తో తీసిన బ్రహ్మోత్సవం సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆ తరువాత కనిపించడం మానేసాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా పరాజయం చాలా మందికి నష్టం తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత శ్రీకాంత్ కు ఎవరు సినిమా ఇచ్చే దైర్యం చేయడం లేదు? ఆ సినిమా తరువాత చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పాపం శ్రీకాంత్ పరిస్థితి బాగాలేదు. ఎవ్వరు ఛాన్స్ ఇవ్వడం లేదట, అంతే కాదు కథలు వినడానికి కూడా ఆసక్తి చూపించడం లేదట !! .. నిజానికి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి మల్టీస్టారర్ సినిమాను పరిచయం చేసిన దర్శకుడికి ఈ పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. బ్రహ్మోత్సవం సినిమా విషయంలో శ్రీకాంత్ అడ్డాల సరిగ్గా అలోచించి ఉంటె బెటర్ గా ఉండేదని టాక్ కూడా ఉంది. మరి ఈ సారి శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నాలు ఫలించి మంచి సినిమాతో రావాలని కోరుకుందాం !!