రాష్ట్రంలో రౌడి పాలన.. !

Friday, September 26th, 2014, 03:20:16 PM IST

srikanth-reddy-and-chandrab
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పధకాలకు గండికొట్టేపనిలో గనిలో కార్మికుడిలా శ్రమపడుతున్నాడని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని.. ఇక డ్వాక్రా మహిళల పరిస్థితి చెప్పలేని విధంగా మారిపోయిందని.. అన్నారు. వృద్దులకు, తివంతువులకు పించన్లు ఇవ్వడానికి 3600 కోట్ల రూపాయలు అవసరమవుతాయని.. కాని.. కేవలం 1300 కోట్ల రూపాయలు మాత్రమె బడ్జెట్ లో కేటాయించారని ఆయన తెలిపారు. ఇక ఆహార సబ్సిడీకి 4200 కోట్లు అవసరమని… కాని కేవలం 2318 కోట్లు మాత్రమే కేటాయించి సైలెంట్ గా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

మొదటి నుంచి చంద్రబాబు నాయుడుసంక్షేమ పధకాలపై ఆసక్తి లేదని.. హైటెక్ పాలనే ముఖ్యమని భావించే వ్యక్తీ అని ఆయన తెలిపారు. ఆధార్ వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆధార్ ను రైతురుణమాఫీకి లింకు పెట్టారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని రౌడి రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలియజేశారు.