వీడియో : ఇతని బౌలింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Monday, November 13th, 2017, 11:33:25 PM IST

ప్రస్తుత రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ టీమ్ లో అవకాశం దక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఒక్క స్థానం కోసం ఎంతో మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. దీంతో ఆటగాళ్లు కూడా కొత్త తరహా ప్రతిభతో పోటీకి వస్తున్నారు. బ్యాట్స్ మేన్స్ ఎవరికీ స్థాయికి తగ్గట్టు వారు బ్యాట్ కి పని చెబుతుంటే బౌలర్లు మాత్రం బంతితో బ్యాట్స్ మెన్లను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నారు. ఈ మధ్య చైనామన్‌ బౌలర్లు బంతిని వేసే స్టైల్ చాలా కొత్తగా ఉంటోంది. అయితే అండర్‌-19 ఆసియా కప్‌లో ఆడిన ఒక శ్రీలంక ఆటగాడు బౌలింగ్ చేసే పద్దతిని చూస్తే ఎంతటివారైనా షాక్ అవ్వాల్సిందే. కుడిచేతి వాటం గల స్పిన్నర్‌ కెవిన్‌ కాధ్‌ధిగోడ శరీరాన్ని మొత్తం వంచి బౌలింగ్ చేస్తున్నాడు. పాల్‌ అడమ్స్‌, శివిల్‌ కౌశిక్‌ కూడా దాదాపు ఇదే తరహాలో వేస్తుంటారు. అయితే ఇతని బౌలింగ్ చూసిన కొంతమంది సీనియర్ క్రికెటర్లు అతని లాగ బౌలింగ్ చేయడం చాలా కష్టమని అయితే అతను అలా అలవాటు చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడో తెలుస్తోందని తెలిపారు. అంతే కాకుండా అతనికి మంచి భవిష్యత్తు ఉందని కూడా వారు వివరించారు.