వర్షం కారణంగా రద్దయిన శ్రీలంక – పాకిస్థాన్ మ్యాచ్

Friday, June 7th, 2019, 07:17:52 PM IST

ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం కారణంగా పాకిస్తాన్‌-శ్రీలంక మ్యాచ్ రద్దయింది. మ్యాచ్‌ రద్దయిన కారణంగా ఇరుజట్లు చెరోపాయింట్ ఇచ్చారు. వర్షం కారణంగా కనీసం టాస్ వేయడం కుదరలేదు. దీంతో మ్యాచ్‌ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 03 గంటలకు మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా, అంతముందే వర్షం ప్రారంభమైంది. పిచ్‌, ఔట్‌ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఒకవేళ వర్షం తగ్గితే మళ్ళీ మ్యాచ్ ప్రారంభించాలి అని అనుకున్నారు కానీ కుదరలేదు. అయితే ఎంతకూ వాన తగ్గకపోవడంతో రాత్రి 08.30 గంటలకు మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్థాన్ తో శ్రీలంక తలపడిన ప్రతిసారి పాకిస్థాన్ గెలవగా, మొదటిసారి పాకిస్థాన్ మీద శ్రీలంక కి ఒక పాయింట్ వచ్చింది.