మెగా కాంపౌండ్‌లో.. కుమ్ముడే కుమ్ముడు!!

Monday, December 26th, 2016, 09:20:46 PM IST

srimukhi
బుల్లితెర యాంక‌ర్‌గా, హీరోయిన్‌గా శ్రీ‌ముఖి సుప‌రిచితం. న‌వ‌త‌రం యాంక‌ర్ల‌లో త‌న‌దైన హ‌వా సాగిస్తూ బుల్లితెర అంతా తానే అయ్యి క‌నిపిస్తోంది. అంద‌మైన‌ ముక్కు మొహం.. ఒడ్డు పొడుగు ఉన్న ఈ అమ్మ‌డు.. ప‌లువురు యువ‌హీరోల గుండెల్లో గిలిగింత‌లు పెడుతోంద‌ని చెప్పుకున్నారు. ఏదైతేనేం .. ఇప్పుడు ఈ అమ్మ‌డు ఏకంగా మెగా కాంపౌండ్ దృష్టిలో ప‌డింది. అక్క‌డ మెగా యువ‌హీరోల‌తో శ్రీ‌ముఖి పంట పండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

లేటెస్టుగా శ్రీ‌ముఖి బాస్ చిరంజీవి సినిమా `ఖైదీనంబ‌ర్ 150` నుంచి ఓ ఆడియో సాంగ్‌కి త‌న‌దైన శైలి హావ‌భావాలు ఇస్తూ ఓ వీడియోని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. రాక్‌స్టార్ దేవీశ్రీ ఇచ్చిన మాస్ బీట్ అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడుకి త‌న‌దైన శైలి అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఇట్స్ నాట్ ఏ మాస్ సాంగ్‌.. ఇట్స్ బాస్ సాంగ్ అంటూనే డీఎస్‌పీ .. యు ఆర్ మ్యాజిక‌ల్ అంటూ ట్వీట్ చేసింది. ఇదంతా చూస్తుంటే మెగా కాంపౌండ్ హీరోల దృష్టిలో ప‌డాలంటే ఇలాంటిదేదో ఒక‌టి చేయాల‌ని స‌ద‌రు యాంక‌ర్ తెలివైన ప్లానింగే చేసింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ యాంక‌ర్ మెగా కాంపౌండ్లో కుమ్ముడే కుమ్ముడు..

  •  
  •  
  •  
  •  

Comments