ప్రీ లుక్ తోనే సంచలనం రేపిన అవసరాల ?

Wednesday, November 30th, 2016, 07:47:28 PM IST

avasarala
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ అటు దర్శకుడిగా మంచి మార్కులే కొట్టేసాడు. అయన లేటెస్ట్ సినిమా ‘జ్యో అచ్యుతానంద అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఈ సారి అడల్ట్ కామెడీ తో మెప్పించే ప్రయత్నంలో ఉన్న శ్రీని .. బాలీవుడ్ లో సంచలనం రేపిన ”హంటర్” సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ”సోగ్గాడు” పేరుతొ రూపొందే ఈ సినిమా ప్రీ లుక్ ఇటీవలే విడుదలైంది. సెక్సీ హాట్ గర్ల్ లిప్స్ తో కైపెక్కించేలా ఉన్న ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్శించింది. అసలు ప్రీ లుక్ లోనే ఇలాంటి హీట్ క్రియేట్ చేస్తే ఇంకా సినిమా ఎలా ఉంటుందో అంటూ టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. దానికి తోడు ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉంటారట!! వారెవరో కూడా కన్ఫర్మ్ చేసాడు .. ఇంతకీ ఆ హాట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా మిస్తీ చక్రవర్తి, తేజస్వి, సుప్రియ, శ్రీముఖి .. మొత్తానికి సరైన హాట్ భామలనే పెట్టుకున్న ఈ సోగ్గాడు విడుదలై ఇంకెన్ని సంచలనాలు రేపుతాడో అని అందరు అనుకుంటున్నారు.