వాడి శవాన్ని చూస్తేనే మాకు ఆనందం… బాధిత కుటుంబాలు

Thursday, February 6th, 2020, 09:50:21 PM IST

గతంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నల్గొండ జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి కి ఫోక్స్లో న్యాయస్థానం నేడు ఉరిశిక్ష విధించింది. అయితే ఈ శిక్ష విషయంలో సదరు బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. కాగా మృతుల్లో ఒకరైన శ్రావణి తల్లి నేడు పోలీసులకు, లాయర్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అయితే అమ్మాయిలను అంతటి దారుణంగా చంపినటువంటి మృగాడిని కేవలం వారం రోజుల లోపే ఉరి తీయాలని, అతడు చనిపోయిన తరువాత అతని శవాన్ని తమకు చూపించాలని, అప్పుడే తమకు మనఃశాంతి అని, తమ పిల్లల ఆత్మలకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు.

ఇకపోతే ఇలాంటి న్యాయమైన తీర్పు కోసమే తామందరు కూడా గత 10 నెలలుగా ఎదురు చూస్తున్నామని, ఎట్టకేలకు అలాంటి మృగాడికి మరణ శిక్ష విధించడం తమకు ఆనందాన్ని కలిగిస్తుందని బాధిత కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా మరొకసారి ఇలాంటి దారుణాలకు పాల్పడలనే ఆలోచన వచ్చిన వారికి ఇదొక భయం కలిగించాలని సదరు బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి.