రవితేజ కోసం కసరత్తులు మొదలు పెట్టిన దర్శకుడు ?

Sunday, December 3rd, 2017, 10:50:06 PM IST

వరుస పరాజయాలతో బిజీగా ఉన్న శ్రీను వైట్ల మళ్ళీ తన సత్తా చాటుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మిస్టర్ పరాజయం తరువాత శ్రీను వైట్ల కు అవకాశాలు కరువయ్యాయి. ఫైనల్ గా రవితేజ్ ఓకే చెప్పడంతో కథ పై కసరత్తులు మొదలు పెట్టారు. ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ .. శ్రీను వైట్ల లైన్ లో ఉన్నారు .. వీరిద్దరిలో శ్రీను వైట్ల తోనే ముందు సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా అమెరికా నేపథ్యంలో సాగుతుందని, అందుకోసం శ్రీను వైట్ల ప్రస్తుతం అమెరికాలో లొకేషన్ వేటలో ఉన్నాడట !! త్వరలోనే రవితేజ కు పూర్తీ స్క్రిప్ట్ వినిపిస్తాడట .. ఆ తరువాత జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments