మెగా హీరోతో రావయ్యా బంగారం అంటున్న శ్రీను వైట్ల ?

Wednesday, January 3rd, 2018, 10:13:59 AM IST

వరుస ప్లాప్ లతో టెన్షన్ మీదున్న శ్రీను వైట్ల మళ్ళీ ఫామ్ లోకి రావడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అయన నెక్స్ట్ సినిమా మెగా హీరో సాయి ధరమ్ తో ప్లాన్ చేసాడు. ఇప్పటికే కథ చర్చలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. సాయి ధరమ్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసారు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంతో పాటు , కరుణాకరణ్ దర్శకత్వంలో సాయి ధరమ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత అయన శ్రీను వైట్ల సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు శ్రీను వైట్ల .. ఇంతకి టైటిల్ ఏమిటో తెలుసా .. రావయ్యా బంగారం !! అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది కాబట్టి .. ఈ లోగా రవితేజ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు శ్రీను వైట్ల.