శ్రీరెడ్డి లీక్స్ : ఈ సారి ఎవరంటే?

Sunday, April 8th, 2018, 04:50:58 PM IST

కాస్టింగ్ కౌచ్ విషయంలో మొన్న గాయత్రీ గుప్తా, నేడు శ్రీ రెడ్డి, మధవి లత. ఇలా పలువురు అప్ కమింగ్ హీరోయిన్ లు అవకాశాల కోసం తమకు ఎదురైన చేదు అనుభవాలను వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పలు చానెల్స్ లో తన బాధను చెప్పుకున్న శ్రీ రెడ్డి నిన్న ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ ఆందోళన తర్వాత టాలీవుడ్ లో తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలీదని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం విదితమే.

గతంలో పరోక్షంగా శేఖర్ కమ్ముల, అలానే నేచురల్ స్టార్ అంటూ మరో హీరో, ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర వాట్సాప్ లో అసభ్యకరంగా చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్ ఖాతాలో శ్రీరెడ్డి పోస్ట్ చేసిన విషయం విదితమే. తాజాగా యూట్యూబ్ సెలబ్రిటీ వైవా హర్షపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. వైవా హర్ష తనతో అసభ్యకరంగా చాట్ చేశాడని ఆమె ఆరోపించింది. వైవా హర్షతో తాను చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. తనకు షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశాలు ఇప్పించమని వివా హర్షను అదగ్గా, ఆ సమయంలో అతడు తనతో వాట్సాప్ లో అసభ్యకరంగా చాట్ చేసిన స్క్రీన్ షాట్లను పోస్ట్ చేసింది. ది గ్రేట్ వైవా హర్ష. యూట్యూబ్ చానెళ్లు, షార్ట ఫిల్మ్స్ లో నాకు అవకాశాలు ఇప్పించమని అడినపుడు నాతో ఇలా చాట్ చేశాడు.

చిన్న చిన్న నటులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏదైనా చేసుకొని బ్రతకొచ్చుగా అన్నవారికి ఇదే నా సమాధానం. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చిన్న ప్రాజెక్టులలో నటించేందుకు కూడా నేను నావంతు ప్రయత్నం చేశాను. కానీ ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉంది. అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఫేజీలో తాజాగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…..

  •  
  •  
  •  
  •  

Comments