బిగ్ బాస్ 12 లో సంచలన క్రికెటర్ శ్రీశాంత్ ?

Sunday, September 16th, 2018, 11:44:09 AM IST

వివాదాస్పద రియాలిటీ షో గా హిందీలో ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ 12 వ సీజన్ త్వరలో మొదలు కానుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పాల్గొనే వారిపేర్లు బయటికి వచ్చాయి. ఈ హౌస్ లోకి మొత్తం 18 మంది కంటెస్టెంట్ ఉంటారట .. అందులో టీమ్ ఇండియా క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఉన్నాడు. శ్రీశాంత్ ఇండియన్ క్రికెట్ టీమ్ నుండి సస్పెండ్ అయినా విషయం తెలిసిందే. అప్పటినుండి శ్రీశాంత్ సినిమా రంగంలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయనను బిగ్ బాస్ టీమ్ ఎంపిక చేయడం సర్వాత్రా ఆసక్తి రేపుతోంది. అయితే ఈ షో లో కొందరు జంటగా కూడా వెళ్ళబోతున్నారు. వారిలో అక్కా చెల్లెలు, ఓ లాయరు, ఓ పోలీస్, ఇద్దరు సింగర్స్ కూడా ఉన్నారు. అందులో కొందరు సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. మొదటి సారి ఓ రైతుకు కూడా ఛాన్స్ దక్కింది.

  •  
  •  
  •  
  •  

Comments