వార్‌లోకి దిగిపోతున్న కింగ్‌ఖాన్ వార‌సులు!!

Monday, February 27th, 2017, 03:55:01 PM IST


కింగ్‌ఖాన్ షారూక్‌ఖాన్ న‌ట‌వార‌సులు ఎవ‌రు? అస‌లింత‌కీ బ‌రిలోకి దిగుతున్నారా? లేదా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే .. ఇదిగో ఇదీ ఆన్స‌ర్‌.

కింగ్‌ఖాన్‌కి ఇద్ద‌రు వార‌సులు బ‌రిలో దిగేందుకు రెడీగా ఉన్నారు. అచ్చుగుద్దిన‌ట్టు తండ్రినే పోలి ఉండే ఆ ఇద్ద‌రూ ఎవ‌రు అంటే.. కొడుకు ఆర్య‌న్ ఖాన్‌. నూనూగు మీసాల వ‌య‌సుకు వ‌చ్చేశాడు ఆర్య‌న్‌. 19 ఏళ్ల ఆర్య‌న్‌ఖాన్ న‌ట‌న‌లో దిగేందుకు పూర్తిగా రెడీ అవుతున్నాడు.ఇప్ప‌టికే జిమ్ముల్లోకుస్తీ ప‌డుతూ బాడీని పూర్తిగా టోన్ చేశాడు. హెయిర్ స్టైల్‌లోనూ తండ్రిని మించి కొత్త‌ద‌నం ట్రై చేస్తున్నాడు. షారూక్ – గౌరీఖాన్‌ల క్యూట్ డాట‌ర్ సుహానా ఖాన్ సైతం అచ్చ ం తండ్రిని పోలి క‌నిపిస్తోంది. ఆ క‌ళ్లు, ముక్కు తీరు తెన్నులు అమ్మ‌డిని చూస్తే బుల్లి షారూక్ అనాల్సిందే. 16 వ‌య‌సుకు వ‌చ్చిన సుహానా న‌టిస్తాను అనాలే గానీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎల్ల‌పుడూ సిద్ధ‌మే. కొడుకు ఆర్య‌న్ కోసం ఇప్ప‌టికే క్రేజీ డైరెక్ట‌ర్‌-ప్రొడ్యూస‌ర్ కాంబినేష‌న్ ల‌తో పెద్ద లైన‌ప్ రెడీగా ఉంది.