భారీ బడ్జెట్ చిత్రంలో శృతి హాసన్..?

Wednesday, February 15th, 2017, 11:55:10 AM IST


గ్లామర్ భామ శృతి హాసన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ”కాటమరాయుడు” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ నటిస్తున్న ”శబాష్ నాయుడు” సినిమాలో మాత్రమే నటిస్తుంది. తండ్రి సినిమా కోసం వేరే సినిమాల కమిట్ మెంట్స్ ఏవి పెట్టుకోని ఈ అమ్మడు ఆ సినిమా పూర్తవడంతో ఇప్పుడు స్పీడ్ పెంచింది. లేటెస్ట్ గా ఓ భారీ బడ్జెట్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే .. బాహుబలి స్ఫూర్తి తో భారీ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు సుందర్ సి. ఇప్పటికే ఈ సినిమాకోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ తానందాల బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాకోసం మొదట్లో మహేష్, విజయ్ లాంటి హీరోలను అడిగాడు. వారిద్దరూ వేరే సినిమాల బిజీ వల్ల నో చెప్పడంతో ఈ సినిమాలో హీరోలుగా జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని, కథ నచ్చడంతో సినిమా చేయడానికి శృతి ఓకే చెప్పినట్టు సమాచారం.