ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ…

Sunday, April 22nd, 2018, 09:18:43 AM IST

లండన్‌కు చెందిన నటుడు మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం, పరాజయాల కారణంగా ఏడాది కాలంగా శృతిహాసన్ సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాల్ని తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. పెళ్లిచేసుకొని జీవితంలో స్ధిరపడాలనే ఆలోచనలో శృతిహాసన్ ఉన్నట్లు, అందుకే కొత్త సినిమాల్ని అంగీకరించడం లేదని ప్రచారం జరుగుతున్నది. గత కొంతకాలంగా ఈ జంట చెట్టపట్టాలేసుకొని తిరుగుతుండటంతో వీరి పెళ్లి నిజమేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు పుల్‌స్టాఫ్ పెడుతూ ఏడాది విరామం తర్వాత హిందీ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టింది శృతిహాసన్. ఆమె ప్రధాన పాత్రలో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ శుక్రవారం ముంబాయిలో ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకురావడం కొత్త అనుభూతిని పంచుతున్నది. మంచి కథల కోసం ఎదురుచూడటం వల్లే ఇన్నాళ్లు గ్యాప్ వచ్చింది. నటన నా జీవితంలో ఓ భాగం. ఆ ఆనందానికి ఎప్పటికీ దూరమవ్వను అని తెలిపింది శృతిహాసన్.

  •  
  •  
  •  
  •  

Comments