హ‌మ్మ‌య్య‌! శ్రుతి ఇన్నాళ్టికి దిగొచ్చింది!

Thursday, April 19th, 2018, 07:08:49 PM IST

గ‌త కొంత‌కాలంగా శ్రుతిహాస‌న్ న‌ట‌న‌కు దూర‌మైన‌ సంగ‌తి తెలిసిందే. త‌ళుకుబెళుకుల ప్ర‌పంచానికి దూరంగా త‌న‌కు న‌చ్చిన చెలికాడుతో విహార‌యాత్ర‌ల్లో బిజీగా ఉంది. ఇదివ‌ర‌కూ త‌ల్లిదండ్రులు క‌మ‌ల్‌-సారిక‌కు త‌న విదేశీ బోయ్‌ఫ్రెండ్‌ని ప‌రిచ‌యం చేసి, త్వ‌ర‌లోనే పెళ్లాడేందుకు సిద్ధ‌మైంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే పెళ్లి మాట అడిగితే ఇప్ప‌ట్లో కుద‌ర‌ద‌ని శ్రుతి స్ప‌ష్టంగా ప్ర‌క‌టించింది. సినిమాల్లో ఎందుకు న‌టించ‌డం లేదు? అన్న మీడియా ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చింది. విశ్రాంతి కోసం సినిమాల‌కు దూరంగా ఉన్నాన‌ని వెల్ల‌డించింది. ఈ మాట‌ల్లో వాస్త‌వం ఉన్నా లేకున్నా.. శ్రుతి మాత్రం చాలా కాలంగా సినిమాల‌కు దూర‌మైందన్న‌ది నిజం. అటు హిందీ, ఇటు తెలుగులో సినిమాల‌కు సంత‌కాలు చేసిందే లేదు.

ఇక అప్ప‌టికే సెట్స్‌పై ఉన్న రాజ్‌కుమార్ రావ్, విద్యుత్ జ‌మ్వాల్ చిత్రాలు పూర్త‌యి రిలీజ్‌కి రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాల్లో శ్రుతి క‌థానాయిక‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాలు రిలీజ్‌కి వ‌స్తున్నాయి. ఆ క్ర‌మంలోనే చాలా గ్యాప్ త‌ర‌వాత శ్రుతిహాస‌న్ కొత్త సినిమాకి సంత‌కం చేసేందుకు రెడీ అవుతోంది. విద్యుత్ జ‌మ్వాల్ క‌థానాయ‌కుడిగా మ‌హేష్ మంజ్రేక‌ర్ తెర‌కెక్కించ‌నున్న తాజా చిత్రానికి సంత‌కం చేసే ఆలోచ‌న‌లో ఉందిట‌. ద‌ర్శ‌కుడు ఇప్ప‌టికే క‌థ వినిపించాడు. త‌న‌కు న‌చ్చింది. అయితే ఒప్పందంపై సంత‌కం చేయ‌డ‌మే ఆలస్యం అని చెబుతున్నారు. హిందీలో రీఎంట్రీ ఇస్తోంది కాబ‌ట్టి, ఇక తెలుగు సినిమాల‌కు సంత‌కాలు చేస్తుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments