5కోట్ల అప్పు ఎగ్గొట్టిన స్టార్‌ క‌మెడియ‌న్‌!

Sunday, April 15th, 2018, 05:57:05 PM IST

అవ‌స‌రానికి అప్పు తీసుకున్నాడు. 5కోట్ల మొత్తం కాబ‌ట్టి, వెంట‌నే తీర్చ‌లేక‌పోయాడు. అయితే అవ‌న్నీ చ‌ట్టానికి చెల్ల‌వు. చెల్ల‌ని చెక్కులిచ్చినా లోనేస్తారు. ఇలాంటి కేసులోనే అడ్డంగా బుక్క‌య్యాడు ఓ స్టార్ క‌మెడియ‌న్‌. బాలీవుడ్‌కి చెందిన ఆయ‌న పేరు రాజ్‌పాల్ యాద‌వ్‌.

రాజ్‌పాల్ బాలీవుడ్‌లో ఫేమ‌స్ క‌మెడియ‌న్‌. కానీ మ‌న తెలుగువారికి మాత్రం కొత్త‌. ఇటీవ‌లే ర‌వితేజ `కిక్ 2`లో న‌టించినా అంత‌గా గుర్తింపు రాలేదు. ఉత్త‌రాది ఫేస్‌ని ఈజీగానే మ‌న‌వాళ్లు గుర్తు ప‌ట్టేశారు. పైపెచ్చు సినిమాలో కామెడీ డిజాస్ట‌ర్ కావ‌డంతో అస‌లే గుర్తు పెట్టుకోలేదు. ప్ర‌స్తుతం రాజ్‌పాల్ కేసు దిల్లీ హైకోర్టులో హియ‌రింగుకి వ‌చ్చింది. దిల్లీకి చెందిన ఓ వ్యాపారి నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో రాజ్‌పాల్ అత‌డి భార్య రాధా యాద‌వ్ ఇద్ద‌రినీ డీఫాల్ట‌ర్లుగా చేర్చారు. చాలాకాలంగా దీనిపై విచార‌ణ సాగుతోంది. ఈ కేసు వ‌ల్ల‌ డిసెంబ‌ర్‌లో మూడు రోజుల పాటు తీహార్ జైలులో ఊచ‌లు లెక్కించాడు. అయితే అత‌డు ఈ అప్పు తీసుకోవ‌డానికి కార‌ణం ద‌ర్శ‌క‌త్వం చేయాల‌న్న కుతూహాలం. అత‌డు డైరెక్ట్ చేసిన సినిమా మాటేమో కానీ, 5కోట్ల మేర అప్పు మిగ‌ల‌డంతో అది తీర్చ‌లేక నానా క‌ష్టాలు అనుభ‌వించాడు. ఇప్పుడిలా కోర్టులు, కేసులు అంటూ తిరుగుతున్నాడు.ఏప్రిల్ 23న మ‌ళ్లీ కోర్టులో హియ‌రింగ్ ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments