సైంటిస్ట్ అయిన స్టార్ హీరో… సినిమాలో కాదు నిజంగానే

Saturday, May 5th, 2018, 12:12:45 PM IST

స్టార్ హీరో అజిత్‌కి కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆయ‌న సినిమాలంటే అభిమానులు కళ్ళప్పగించి చూడటమే కాకుండా ఆయన వేసే డైలాగులకు చెవి కోసుకుంటుంటారు. సినిమాల‌పైనే కాకుండా బైక్‌, కారు రేస్‌, ఫోటోగ్ర‌ఫీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే అజిత్ కొద్దిరోజుల నుండి చిన్న విమానాలు, హెలికాఫ్ట‌ర్స్‌ని త‌యారుచేస్తున్నారు. ఒక సైంటిస్ట్ లాగా ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ ప్రతీ తయారు చేయాలనుకున్న వస్తువుకు సంబంధించిన అంశంపై బాగా రీసెర్చ్ చేస్తాడు. అయితే రీసెంట్‌గా డ్రోన్‌ల త‌యారీపై కూడా కాన్స‌న్‌ట్రేష‌న్ చేశాడు.

ఇటీవ‌ల దీనిపై అధ్య‌య‌నం చేయ‌డానికి మ‌ద్రాస్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి వెళ్లి అక్కడి విద్యార్థులతోనూ ముచ్చటించారు. అయితే అజిత్ లోని ప్ర‌తిభ‌ని గుర్తించిన ఎంఐటీ ఆయ‌న‌ని ‘హెలికాప్టర్‌ టెస్ట్‌ ఫైలట్‌ అండ్‌ యూఏవీ సిస్టం’ సలహాదారుడిగా నియమించింది. ఇలాంటి అరుదైన గుర్తింపును తెచ్చుకున్న తొలి నటుడు అజిత్‌ కావడంతో ఆయ‌న అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం శివ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాసం అనే సినిమా చేస్తున్నాడు అజిత్‌. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జ‌ర‌గుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో క‌థానాయిక‌గా న‌య‌న‌తార న‌టిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments