స్టార్ హీరో కూతురు చిక్కుల్లో

Friday, May 25th, 2018, 09:50:03 PM IST

ఒక సినిమా ఒప్పుకుని ఆ సినిమా పూర్తి కాకుండానే వేరొక సినిమాకి అంగీక‌రించిన క‌థానాయిక‌లు ఆ త‌ర‌వాత చ‌ట్ట‌ప‌రంగా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో పీవీపీ సంస్థ‌తో ఓ సినిమాకి సంత‌కం చేసిన శ్రుతిహాస‌న్ మ‌ధ్య‌లోనే ఆ ఒప్పందాన్ని డీవియేట్ చేసింది. త‌మిళంలో ఓ భారీ చిత్రానికి సంత‌కం చేసింది. ఆ త‌ర‌వాత ఆ గొడ‌వ కోర్టుల ప‌రిధిలోకి వెళ్లాక‌, దానిని మ‌ధ్య‌వ‌ర్తులు సెటిల్ చేయాల్సొచ్చింది.

అదంతా గ‌తం. వ‌ర్త‌మానంలో ఓ న‌వ‌త‌రం నాయిక‌.. అందునా ఓ డెబ్యూ నాయిక సేమ్ టు సేమ్ కోర్టు గొడ‌వ‌ల్లో చిక్కుకుంది. ఇంత‌కీ ఎవ‌రా భామ‌? అంటే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్. ఈ భామ న‌టిస్తున్న తొలి చిత్రం `కేదార్‌నాథ్‌` కొన్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆ క్ర‌మంలోనే సారా వేరొక భారీ ప్రాజెక్టుకు సంత‌కం చేసింది. ఎన‌ర్జిటిక్ బోయ్ ర‌ణ‌వీర్ స‌ర‌స‌న `సింబా` చిత్రానికి సారా సంత‌కం చేసేందుకు డాడ్ సైఫ్ ఎంతో సాయం చేశారు. అయితే ఆ సినిమా కాల్షీట్ల‌కు, ప్ర‌స్తుత సినిమా డేట్స్‌కు మ‌ధ్య క్లాషెస్ త‌లెత్త‌డంతో సీరియ‌స్ అయిన కేధార్‌నాథ్‌ ద‌ర్శ‌కుడు అభిషేక్ క‌పూర్‌ కోర్టులో కేసు పెట్టాడు. సారా 5కోట్ల మేర కాంప‌న్సేష‌న్ చెల్లించాల‌ని అత‌డు కోర్టును డిమాండ్ చేశాడు. సెప్టెంబ‌ర్ నుంచి సారా కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండ‌గా.. అప్పుడు సింబా సెట్స్‌కి వెళ్లాల్సిన స‌న్నివేశం ఉంది సారాకు. అందుకే ఈ వివాదం త‌లెత్తింది.

  •  
  •  
  •  
  •  

Comments