కార‌వ్యాన్ రెంటుకిస్తున్న హీరో?

Monday, May 7th, 2018, 11:41:47 PM IST


ప్ర‌స్తుతం ఉన్న స్టార్ హీరోలంద‌రికీ సొంతంగా కార‌వ్యాన్‌లు ఉన్నాయి. ఆన్ లొకేష‌న్ అన్నీ ఇందులోనే. సక‌ల సౌక‌ర్యాల‌తో ఈ ప్ర‌త్యేక వాహ‌నం లొకేష‌న్‌లో సేవ‌లు చేస్తుంటుంది. అయితే ఇలా లొకేష‌న్‌కి షూటింగుకి తిప్పినందుకు ఓ స్టార్ హీరో నిర్మాత నుంచి రెంటు వ‌సూలు చేస్తున్నాడ‌న్న‌ది హాట్ టాపిక్‌. స‌ద‌రు స్టార్ హీరో కోట్లలో పారితోషికం అందుకుంటూ ఇలా క‌క్కుర్తి ప‌డ‌డ‌మేంటి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఆ కార‌వ్యాన్‌ని స‌ద‌రు హీరో ఆరేళ్ల క్రితం కొన్నాడు. అటుపై షూటింగుల్లో వాడుతున్నాడు. ఒక‌రోజుకు 5000 రెంటు వ‌సూలు చేస్తున్నాడుట‌. సినిమాకి 60 కాల్షీట్లు అనుకుంటే అందులో 40 కాల్షీట్లలో ఈ కార‌వ్యాన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. సినిమాకి మినిమంగా మూడు షెడ్యూళ్ల‌కు 180 రోజులు అనుకుంటే, మొత్తంగా 8 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తున్నాడ‌ట‌. కోట్ల‌కు కోట్లు పారితోషికం అందుకుంటూ స‌ద‌రు హీరో చేస్తున్న నిర్వాక‌మేంటా? అంటూ నిర్మాతల స‌ర్కిల్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ ఒక్క ప‌ని వ‌ల్ల స‌ద‌రు హీరోపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గౌర‌వం త‌గ్గిందిట‌. ఇంత‌కీ ఎవ‌రా హీరో?