మహానటి ఆడియో ఫంక్షన్ కి స్టార్ హీరో.. ఎవరో తెలుసా

Tuesday, May 1st, 2018, 12:12:45 PM IST

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర సీమలో మోస్ట్ ఎవైటెడ్ మూవీ మ‌హాన‌టి అన్నసంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కింది ఓ భారీ ఈ చిత్రం మహానటి. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌ రాజ్, షాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకుడు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్ర‌ల‌లో ప్రియాంక ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మే 9న భారీ స్థాయిలో విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ చాలా జోరుగా జ‌రుగుతున్నాయి.

ఒక‌వైపు చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్‌తో పాటు ఆడియో సాంగ్స్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తు సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సాంగ్స్ విడుద‌ల చేసిన యూనిట్ ఈ రోజు జ‌ర‌గ‌నున్న ఆడియో ఈవెంట్‌లో మిక్కీ జే మేయ‌ర్ స‌మ‌కూర్చిన‌ మిగ‌తా సాంగ్స్ రిలీజ్ చేయడానికి సర్వత్రా సిద్దం చేశారు. కొద్దిరోజుల నుండి పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ కోసం మరియు సినిమా టీం ను మరింత ఉత్తేజపరచడం కోసం పెద్ద హీరోలు కూడా ఏ ఆడియో ఫంక్షన్లకో, ప్రీ రిలీజ్ ఈవెంట్లకో హాజరవుతున్నారు.

ఇప్పుడు కూడా ఈ ఆడియో ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రు కానున్నాడ‌ట‌. చిత్ర నిర్మాత స్వ‌ప్న ద‌త్‌కి ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ కావ‌డంతో మ‌హాన‌టి ఈవెంట్‌కి వచ్చేందుకు ఆయ‌న సుముఖత చూపార‌ట‌. గ‌తంలో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఆడియో వేడుక‌కి కూడా ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ బయోపిక్ గా రూపొందిన మహానటి చిత్రంలో సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను చూపించనున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం విడుదల కానున్న మరిన్ని పాటల కోసం మీరూ వెయిట్ చేయండి.