మహానటి ఎడిటింగ్ లో స్టార్ హీరోయిన్ మిస్!

Wednesday, May 9th, 2018, 10:10:44 PM IST


దివంగత మహానటి సావిత్రి గారి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ అశ్విన్ నిర్మించగా, వైజయంతి మూవీస్ పతాకంపై స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మించారు. కీర్తి సురేష్ సావిత్రి గారి పాత్రా పోషించారు. కాగా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుండటం, అందునా ఎంతోమంది ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలోకి వెళ్లిపోయాయి. అయితే మనం చెప్పుకోబోతున్న అసలు విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తోంది అంటూ యూనిట్ సభ్యులు ఇటీవల ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.

మ‌హాన‌టిలో కాజ‌ల్ ఏమి చేస్తోందో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ వ‌ర‌కు ఆగండి అంటూ కామెంట్ కూడా పెట్టింది చిత్ర యూనిట్. అప్పటినుండి కాజల్ ఫాన్స్ ఎప్పుడెప్పుడు ఆ బయోపిక్ లో కాజల్ ని చూద్దామా అని ఆశపడ్డారు. అయితే నేడు విడుదలయిన చిత్రాన్ని చూసిన కాజల్ అభిమానులు ఆమె పాత్ర చిత్రంలో కనపడక నిరాశకు లోనయ్యారు. అసలు విషయం ఏమిటంటే చిత్ర నిడివి దృష్ట్యా ఆమె పాత్ర ఎడిటింగ్ లో తీసివేయవలిసివచ్చిందని చిత్ర బృందం చెపుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు నిరుత్సాహానికి గురయినట్లే మరి…….

  •  
  •  
  •  
  •  

Comments