పవన్ పై రచయిత షాకింగ్ కామెంట్స్..ఆపడం ఎవరి వల్లా కాదు..!

Saturday, September 23rd, 2017, 05:50:41 PM IST


సూపర్ హిట్ చిత్రాలు ఇంద్ర, నరసింహ నాయుడు, గంగోత్రి వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన చిన్ని కృష్ణ తెలుగు సినీ అభిమానులకు సుపరిచితుడే. బద్రీనాథ్ వంటి పరాజయాలు ఎదురైన తరువాత చిన్ని కృష్ణకు అవకాశాలు బాగా తగ్గాయి. కాగా ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో చిన్ని కృష్ణ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై మీ అభిప్రాయం ఏంటని అడగగా.. ఆయన ఎమోషనల్ గా చెప్పిన సమాధానం సంచలనంగా మారింది.

పవన్ ని ప్రశంసలతో ముంచెత్తుతూ..పవన్ కళ్యాణ్.. మదర్ థెరెసా, గౌతమ బుద్ధుడు అంతటి గొప్ప వ్యక్తి అంటూ చెప్పేశారు. భారత జాతి లోనే పవన్ కళ్యాణ్ అరుదైన వ్యక్తి అని కితాబిచ్చారు. ఎంతటి క్రూర స్వభావ వ్యక్తి మనసునైనా పవన్ కళ్యాణ్ భాదించాడని అన్నారు. ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ దేశానికే ఐకానిక్ పొలిటీషియన్ గా మారుతాడని అన్నారు. దీనిని ఆపడం ఎవరి వల్లా కాదని చిన్ని కృష్ణ తెలిపారు.