ట్రంప్ అందరికీ షాక్ ఇస్తుంటే ఈయన ట్రంప్ కే షాక్ ఇచ్చాడు

Tuesday, January 31st, 2017, 12:22:28 PM IST

starbucks-ceo
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వీరోచిత నిర్ణయం పట్ల సర్వత్రా సీరియస్ గళం వినిపిస్తోంది. ముస్లిం లని తోక్కేయ్యాలి అనే మూర్ఖత్వపు ఆలోచన విపు సాగుతున్న ట్రంప్ ఇప్పుడు ఏ దేశ శరణార్ధులు కూడా అమెరికా లో అడుగు పెట్టనే కూడదు అంటూ ఆంక్షలు విధించాడు. ఇప్పుడు ట్రంప్ కే షాక్ ఇచ్చాడు స్టార్ బక్స్ యజమాని. ప్రఖ్యాత స్టార్ బక్స్ సంస్థ తాము శరణార్ధులకి ఉద్యోగాలు ఇచ్చి తీరతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కాఫీ రిటైలర్స్ చైర్మన్ – సీఈఓ హోవర్డ్ షుల్జ్ మాట్లాడుతూ అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లలో ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిలో నియమిస్తామని స్పష్టం చేశారు. సిరియా ఇరాక్ లలో అమెరికా సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచిన శరణార్థులకు అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంలో హోవర్డ్ హిల్లరీ క్లింటన్ కు మద్దతుగా నిలిచారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెల్త్ కేర్ చట్టాన్ని రద్దు చేయటం మెక్సికోతో వ్యాపార లావాదేవీలను పునర్వ్యవస్థీకరించటం ఇప్పుడు ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలోకి రానివ్వకుండా నిషేధించటంపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మెక్సికోలో కాఫీ తోటల పెంపకందారులను స్టార్ బక్స్ సహాయం చేస్తుందని హోవర్డ్ స్పష్టం చేశారు.