కొందరు ఆశించడానికి.. మరికొందరు శాసించడానికి పుడతారు

Monday, June 10th, 2013, 02:34:59 PM IST


నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా రామకృష్ణ స్టూడియోలో ఆయన కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు. కొందరు ఆశించడానికి పుడతారు.. మరికొందరు శాసించడానికి పుడతారని బాలయ్య అన్నారు. అభిమానం అనేది గుండె లోతుల్లోంచి రావాలని.. డబ్బుతో, ప్రలోభాలతో అభిమానులను సంపాదించుకోలేరని ఆయన అన్నారు.

రామకృష్ణ స్టూడియోలో బాలయ్య జన్మదిన వేడుకలు ఆడంబరంగా జరిగాయి. ఇందుకోసం స్టూడియోలో ప్రత్యేక వేదిక నిర్మించారు. భారీ సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన జన్మదినం సందర్భంగా బాలయ్య పింక్ కలర్ షర్టులో మెరిసిపోతూ కనిపించారు. ఈ వేడుకలో బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు.

తన కొత్త సినిమా కోసం బాలయ్య ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకున్నారు. కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తొలిసారిగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.