బ్రేకింగ్: టీడీపీ నేత వర్ల రామయ్యకు దిమ్మతిరిగే షాక్!

Monday, October 14th, 2019, 03:56:43 PM IST

తెలుగు దేశం పార్టీ రాజకీయ మనుగడ కోసం చేస్తున్న విమర్శలు, పోరాటాలు చూస్తుంటే ప్రజలకు సైతం చిరాకు పుట్టిస్తుంది అని వైసీపీ నేతలు పలుమార్లు ఆరోపించారు. తాజాగా పోలిసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ,టీడీపీ నేత వర్ల రామయ్య పై దారుణ ఆరోపణలు చేసారు. ఇప్పటికే పోలీసులని పలుమార్లు హెచ్చరించిన వర్ల రామయ్య శ్రీనివాస్ చేతికి అడ్డంగా దొరికిపోయారు. పోలిసుల జాతకం నా చేతిలో వుంది అని బెదిరిస్తున్న వర్ల రామయ్యను ఉద్దేశించి ఇలా అన్నారు. పోలిసుల జాతకం నీ చేతిలో ఉంటే, నీ జాతకం నా చేతిలో వుంది. ఖబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసారు.

పోలీస్ అధికారుల సంఘం కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ, టీడీపీ పై పలు ఆరోపణలు చేసారు. పోలీసుల పై ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, దూషించినా న్యాయ పోరాటం చేస్తాం అని అన్నారు. టీడీపీ రాజకీయ పబ్బం గడుపుకోడానికే ఇలా సత్య ప్రచారాలు చేస్తుంది అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎన్నికలలో ఓటమి తరువాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులకు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.