హ‌రీష్ ఎందుకు ముఖం చాటేస్తున్నారు?

Monday, June 3rd, 2019, 02:47:22 PM IST

తెరాస ట్ర‌బుల్ షూటర్ త‌న్నీరు హ‌రీష్‌రావు పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఎందుకు దూరంగా వున్నారు?. తెర వెనుక ఏం జ‌రుగుతోంది?. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెరాస `కారు సారు ప‌ద‌హారు` నినాదంతో ముందుకు వెళ్లింది. కానీ అది బెడిసికొట్టి 9 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. ఉట్టికెక్క‌లేన‌మ్మ స్వర్గానికి ఎగిరింద‌ట‌. అన్న‌ట్టు స్వ‌రాష్ట్రంలో ప‌రిస్థితుల్ని చ‌క్క‌దిద్ద‌లేని కేసీఆర్ కేంద్రంలోకి వెళ్లి ఏం చేస్తార‌ని ఆలోచించిన తెలంగాణ ఓట‌ర్లు తెరాస‌కు గుణ‌పాఠం చెప్పారు. అయితే ఈ ఫ‌లితాలు రావ‌డానికి కార‌ణం హ‌రీష్ రంగంలోకి దిగ‌క‌పోవ‌డ‌మే అన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. దీన్ని జీర్ణించుకోలేని తెరాస అధినాయ‌క‌త్వం ఇప్ప‌టికీ హ‌రీష్‌ని దూరంగానే పెడుతోంది.

గ‌త ప్ర‌భుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన హ‌రీష్‌ని కేవ‌లం ఈ ద‌ఫా ఎమ్మెల్యే ప‌ద‌వికే ప‌రిమితం చేశారు. అదే హ‌రీష్‌రావుకు మ‌న‌స్తాపం క‌లిగించింద‌ట ఆ కార‌ణంగానే పుట్టిన రోజు వేడుక‌ల‌కు హ‌రీష్‌రావు దూరంగా వున్నార‌ని, ఈ రోజు అందుబాటులో లేకుండా పోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో హ‌రీష్ ముఖం చాటేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇప్ప‌టికైనా తెరాస అధినాయ‌క‌త్వం హ‌రీష్‌కి పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పించ‌క‌పోతే తెలంగాణలో తెరాస స్థానంలోకి బీజేపీ రావ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని, ఈ విష‌యం తెలిసి జాగ‌రుక‌త‌తో వ్య‌వ‌హ‌రించ‌క‌పోయినా..ఈగోకు వెళ్లినా భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.