హిందువుల మీద ముస్లిం లు దాడి చెయ్యకండి – ప్రధాని

Sunday, November 13th, 2016, 01:08:15 PM IST

sheikh-hasina
బంగ్లాదేశ్ లో మైనారిటీ ల మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. మైనారిటీ లుగా ఉన్న హిందువుల మీద జరుగుతున్న దాడులు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ విషయం మీద దేశ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. హిందూ దేవాలయాల మీదా , హిందువుల మీదా దాడులు చెయ్యద్దు అని ఆమె ప్రజలకి హెచ్చరిక జారీ చేసారు. ఒక స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న మైనారిటీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ముస్లింలదేనని ఆమె స్పష్టం చేశారు. దాడుల ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వారిని చట్టం ముందు నిలిపి కఠిన శిక్షలు పడేలా చూస్తామని హసీనా హెచ్చరించారు.