జ‌క్క‌న్న‌కు క‌థే లేదు.. ప్రాజెక్ట్‌ మొద‌లెట్టేదెపుడు?

Sunday, October 22nd, 2017, 07:18:06 PM IST

బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత రాజ‌మౌళికి కేవ‌లం తెలుగులోనే కాదు, జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో వీరాభిమానులేర్ప‌డ్డారు. గ్లాడియేట‌ర్‌, 300, ట్రాయ్‌ వంటి అంత‌ర్జాతీయ సినిమాల‌కు ధీటుగా `బాహుబ‌లి` చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌క‌ధీరుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ముఖ్యంగా ఉత్త‌రాది జ‌నం జ‌క్క‌న్న ట్యాలెంటుకు సాహో అన్నారు. ఆ క్ర‌మంలోనే రాజ‌మౌళి తెర‌కెక్కించే త‌దుప‌రి సినిమా ఏంటి? అన్న క్యూరియాసిటీ అంద‌రిలోనూ ఏర్ప‌డింది. ఇదిగో .. అదిగో అంటున్నారు కానీ ఇప్ప‌టికీ ఏ విష‌య‌మూ క్లారిటీ రాలేదు.

అయితే స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ రెడీ చేస్తే కానీ ఏ విష‌య‌మూ తేల‌దు. రాజ‌మౌళి కోసం క‌థ రాయ‌డంలోనే విజ‌యేంద్రుడు బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం క‌థ‌లు వినిపిస్తున్నా.. వింటున్నాడు. ఇంకా ఏదీ ఫైన‌ల్ కాలేద‌ని రీసెంటుగానే `మెర్స‌ల్‌` స‌క్సెస్‌మీట్‌లో విజ‌యేంద్రుడు క్లారిటీనిచ్చారు. ఈసారి తెర‌కెక్కించ‌బోయేది సోష‌ల్ కాన్సెప్టు ఉన్న క‌థాంశ‌మేన‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు తాను స్క్రీన్‌ప్లే ఇచ్చిన మెర్స‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో విజ‌యేంద్రుడు సెల‌బ్రేష‌న్స్ మోడ్‌లో ఉన్నారిప్పుడు.

  •  
  •  
  •  
  •  

Comments