ఓ స్త్రీ రేపురా..అంటూ బాక్స్ ఆఫీస్ హిట్టు కొట్టేశారు!

Monday, September 3rd, 2018, 05:30:50 PM IST

ఇటీవల కాలంలో హర్రర్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ జానర్ సినిమాలు మంచి కిక్ ఇస్తాయి. బాలీవుడ్ లో అలాంటి మంచి కిక్ ఇచ్చే సినిమానే ఇటీవల రిలీజయింది. రాజ్ కుమార్ రావు, శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రల్లో అమర్ కౌశిక్ తెరకెక్కించిన హర్రర్ చిత్రం ‘స్త్రీ’. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో మరుసటి రోజు నుంచి కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో గతంలో నెలకొన్న ఒక రూమర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్నేళ్ల క్రితం రాత్రి సమయాల్లో ఓ ఆడ దెయ్యం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ జనాలను చంపేస్తుందని ఒక ఉదంతం బాగా వైరల్ అయ్యింది. దీంతో కర్ణాటక ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఓ స్త్రీ రేపురా అని అక్షరాలు కనిపించాయి. అందరికి తెలిసిన ఈ పాయింట్ తో చిత్రాన్ని తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేశారు. మొదటి రోజు ఈ సినిమా రూ.6.82 కోట్లు, శనివారం రూ.10.87 కోట్లు, ఆదివారం రూ.13.57 కోట్లను వసూలు చేసి మొత్తంగా రూ.31.26 కోట్ల గ్రాస్ ను దాటేసినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఈ వారం కూడా స్త్రీ సినిమా మరిన్ని లాభాలను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments