GHMC సంచలన నిర్ణయం – పాపం విద్యార్థుల పరిస్థితి ఏంటో…?

Wednesday, June 19th, 2019, 02:35:46 AM IST

ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసిన విద్యార్థులందరి చూపు హైదరాబాద్ లోని అమీర్ పేట వైపే ఉంటుంది. ఎందుకంటే అమీర్ పేట లో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కోచింగ్ తీసుకోవాలంటే మాత్రం అందరు కూడా దాదాపుగా అమీర్ పేట కె వెళ్తుంటారు కూడా. ప్రతి సాఫ్ట్ వెర్ కి సంబందించిన కోచింగ్ కూడా అక్కడే ఇస్తుంటారు. ఇందుకోసమనే అమీర్ పేటలో కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా నెలకొన్నాయి. అయితే ఆ కోచింగ్ ల పేరిట కరపత్రములు, హోర్డింగ్స్, బోర్డులు అన్ని చాలాకనిపిస్తుంటాయి. అక్కడ ఎటు వైపు చుసిన కూడా అన్ని దిక్కుల్లో కోచింగ్ సెంటర్లకు సంబందించిన బోర్డులే కనిపిస్తుంటాయి. అయితే ఈ బోర్డులతో చాలా సమస్యలు వస్తున్నాయని హైదరాబాద్ లోని GHMC ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. అమీర్ పేటలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 20000 హోర్డింగ్స్, బోర్డులను పీకిపారేసింది. అంతేకాకుండా ఇకనుండి అక్కడ ఎలాంటి బోర్డులని పెట్టకూడదని, ఒకవేళ అలా ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది.

కాగా ఈ నిర్ణయంతో దాదాపుగా చాలా మంది విద్యార్థులు అయోమయంలో పడనున్నారు. ఎందుకంటే వారికి ఎక్కడ ఎలాంటి కోచింగ్ సెంటర్లలో వారికి తగిన కోచింగ్ ఇస్తారనేది ఆ బోర్డుల వల్లే తెలిసేది. కానీ ఇప్పుడు అవేమి లేవు. అయితే ఈ నిర్ణయంతో కొందరు ఏకిభవించినప్పటికీ, మరికొందరు మాత్రం నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల సూరత్ లో జరిగినటువంటి ఫైర్ ఆక్సిడెంట్ కూడా ఇలాంటి ప్రదేశాల్లో జరిగితే మాత్రం కనీస ఫైర్ సిబ్బంది వారు కూడా రక్షించడానికి ఇబ్బంది అవుతుందని, ఒకరకంగా చెప్పాలంటే అవి తీసేయడమే బెటర్ అని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.