ఈ ఒక్క స్టిల్ చాలు..అజ్ఞాతవాసిలో ఆమె పాత్ర రేంజ్ చెప్పడానికి..!

Monday, January 8th, 2018, 06:38:28 PM IST

కళ్లు చెదిరేలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మానియా మొదలైపోయింది. బుధవారం రోజే అజ్ఞాతవాసి చిత్రం విడుదల కానుండడంతో ఆ సందడి కనిపిస్తోంది. కాగా చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయాయి. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఖుష్భు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బు పాత్రకు సంబందించిన పోస్టర్ ని విడుదల చేశారు. అభిమానుల్లో ఈ పోస్టర్ ఆసక్తిని పెంచేస్తోంది.

ఖుష్బూ వెనుకాల పవన్ కళ్యాణ్ నిలబడుకుని ఉన్న స్టిల్ అదుర్స్ అని చెప్పొచ్చు. ఖుష్బు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. సినిమాలో ఆ సన్నివేశం ఒకానొక హైలైట్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఖుష్బు పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ పోస్టర్ ద్వారా అర్థం అవుతోంది.