స్టైలిష్ పోస్టర్ ఇంపాక్ట్ : నా పేరు సూర్య

Thursday, March 1st, 2018, 06:03:15 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రంకుఖ రచయిత వక్కంతం వంశి తొలి సారి మెగా ఫోన్ పడుతున్న చిత్రం నా పేరు సూర్య. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ఇంపాక్ట్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. అలానే టీం రెండు పాటలను కూడా విడుదల చేసింది. అవి కూడా శ్రోతలను అలరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నేడు ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ ఇంపాక్ట్ ను యూనిట్ విడుదల చేసింది. స్టైలిష్ రగ్గుడ్ లుక్ లో బన్నీ జీప్ మీద కూర్చుని సిగార్ కాలుస్తున్న ఫోటో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇంటర్నెట్ లో హల చల్ చేస్తోంది. బన్నీ ని ఇంత స్టైలిష్ లుక్ లో చూసిన ఫాన్స్ తెగ మురిసిపోతున్నారు. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా మే మొదటి వారం లో విడుదల కానుంది…