వైరల్ వీడియో : అలా తళుక్కున మెరిసిన అమీర్ ఖాన్!!

Tuesday, March 13th, 2018, 11:22:11 PM IST


ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ సెన్సషన్ దంగల్‌ చిత్రం లో ఆయన ఇద్దరు కూతుళ్లతో ఒక కూతురుగా నటించిన సనా ఫాతిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దంగల్ చిత్రం లో తన అద్భుత నటనతో ప్రేక్షకులనుండి మంచి పేరు అందుకుంది. దంగల్‌ సినిమాతో పేరు తెచ్చుకున్న సనా మరోసారి ఆమిర్‌ ఖాన్‌తో కలిసి నటిస్తోంది. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం సనా తీవ్రంగా జిమ్ లో కసరత్తులు చేస్తోంది. తాజాగా ఈమె జిమ్‌లో డంబుల్స్‌ ఎత్తుతూ, తీవ్రంగా వర్కౌట్స్‌ చేస్తున్న వీడియోను ఆమె అభిమాని ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

సనా ఇలా వర్కౌట్స్‌ చేస్తుండగా అనుకోకుండా అక్కడే తిరుగుతున్న ఆమిర్‌ ఖాన్‌ ఆమె వెనుక ఉన్న అద్దంలో కనిపించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇలా ఆమిర్‌ అనుకోకుండా కనిపించడంతో ఈ వీడియోను ఆయన అభిమానులు విపరీతంగా షేర్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా ఈ సంవత్సరం దీపావళి కానుకగా నవంబర్ 7న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది….

  •  
  •  
  •  
  •  

Comments