సుధీర్‌బాబు స్ట‌న్నింగ్ మేకోవ‌ర్‌

Wednesday, April 18th, 2018, 01:13:15 PM IST

టాలీవుడ్‌లో 8-ప్యాక్ ఉన్న ఏకైక హీరో. `భాఘి` సినిమాతో అత‌డికి బాలీవుడ్‌లోనూ గుర్తింపు ద‌క్కింది. ఆ సినిమాలో ష‌ర్ట్‌లెస్ లుక్‌లో ప‌లు యాక్ష‌న్ సీక్వెన్సుల్లో మ‌తి చెడ‌గొట్టే పెర్ఫామెన్స్ చేశాడు. అంతకుముందే టాలీవుడ్ డెబ్యూ సినిమా కోసం అత‌డు నేరుగా ప్ర‌మోష‌న‌ల్ వేదిక‌పైనే అదిరిపోయే జిమ్నాస్టిక్ ఫీట్స్‌తో ఆక‌ట్టుకోవ‌డం బాలీవుడ్ ఆఫ‌ర్‌ని తెచ్చింది. అయితే అది గ‌తం.. ఇప్ప‌టికీ సుధీర్ బాబు ఫిట్‌నెస్ ప‌రంగా ఎలాంటి అల‌స‌త్వం లేకుండా లుక్ మెయింటెయిన్ చేయ‌డం హాట్ టాపిక్ అవుతోంది.

ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `స‌మ్మోహ‌నం` అనే సినిమా చేస్తున్నాడు సుధీర్‌బాబు. ఈ సినిమా ఆన్‌సెట్స్ ఉందిప్పుడు. ఆ క్ర‌మంలోనే త‌న ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్‌ శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఈ సినిమాతో పాటు సుధీర్‌బాబు బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌, ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌, బ్యాడ్మింట‌న్ జాతీయ కోచ్ పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్‌కి రంగం సిద్ధం చేస్తున్నాడు. తెలుగు, హిందీలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ప్ర‌ఖ్యాత‌ ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో క‌లిసి అబండాంటియా సంస్థ నిర్మించ‌నుంది. ఈ ప్రాజెక్టు గురించి తాజా అప్‌డేట్స్ రావాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments