హీరోయిన్ ముందు కుక్క కంటే దారుణంగా ప్రవర్తించాడు!

Thursday, March 8th, 2018, 02:34:45 PM IST

సుడిగాడు – బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ కు వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి కుక్క కంటే అసహ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లో అంబావాడీ ప్రాంతంలో తన స్నేహతులతో కలిసి షాపింగ్ కు వెళ్లిన నటి మోనాల్ గజ్జర్ షాపింగ్ మాల్ ముందు కార్ పార్క్ చేసింది. అయితే షాపింగ్ అనంతరం ఆమె తీరిగి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి ఆమె కారు టైరుపై మూత్రం పోయసాగాడు. ఆగ్రహించిన మోనాల్ అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా అతను ఏ మాత్రం ఆలోచించకుండా వెక్కిలి చేష్టలు చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి సమీమపంలోనే ఓ షాప్ ని నిర్వహిస్తుంటాడని కనుగొన్నారు. మోనాల్ ప్రస్తుతం గుజరాత్ సినిమాల్లో అలాగే కోలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.