మ‌మ్మీ లీక్స్‌ : కింగ్‌ఖాన్ వార‌సురాలు ఎంట్రీ?

Tuesday, March 13th, 2018, 09:57:17 PM IST

కింగ్ ఖాన్ సుహానా సినీఎంట్రీ గురించి చాలాకాలంగా వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. సుహానా వ్య‌వ‌హార శైలిలో మార్పు ఆ విష‌యాన్ని స్ప‌ష్ట‌ప‌రిచింది. ప‌బ్లిక్ వేడుక‌ల్లో సుహానా అప్పియ‌రెన్స్ క‌థానాయిక‌గా ఎంట్రీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డమేన‌న్న చ‌ర్చ‌కు తెర‌లేపింది. అదంతా అటుంచితే సుహానా ప్ర‌స్తుతం విదేశాల్లో చ‌దువులు పూర్తి చేస్తోంది. ఇలా స్ట‌డీ పూర్త‌వ్వ‌గానే, ఇండియాలో అడుగుపెడుతుంది. అటుపై బాలీవుడ్‌లో క‌థానాయిక‌గా అడుగుపెడుతుంద‌ని తెలుస్తోంది.

అయితే ఇన్నాళ్లు అదో స్పెక్యులేష‌న్ మాత్ర‌మే అని భావించేవారికి ఫుల్ క్లారిటీ వ‌చ్చేలా సుహానా త‌ల్లి గౌరీఖాన్ నోరు జారింది. సుహానా తొందర్లోనే ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీ షూట్‌కి సిద్ధ‌మ‌వుతోంది. అది ఏ మ్యాగ‌జైన్ అనేది చెప్ప‌ను. అయితే త‌న రాక ఖాయ‌మైన‌ట్టేన‌ని తెలిపింది. మొత్తానికి సుహానా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఏ క్ష‌ణ‌మైనా త‌న డెబ్యూ సినిమా గురించిన వివ‌రం బ‌య‌టికి తెలిసే అవ‌కాశం ఉంది. ఇక మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఇంట‌ర్వ్యూలో ఏదో ఒక‌టి తేల్చేస్తుందేమో చూడాలి. సోనాక్షి, సోన‌మ్, జాన్వీ క‌పూర్‌, అహ‌నా పాండే, సారా అలీఖాన్ .. వీళ్లంద‌రికీ ఇక సుహానా నుంచి పోటీ త‌ప్ప‌దేమో?

  •  
  •  
  •  
  •  

Comments