విషాదం : నగరంలో ఒకే గదిలో ఇద్దరమ్మాయిలు ఆత్మహత్య…?

Friday, February 7th, 2020, 07:44:47 PM IST

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో కొద్దిసేపటిక్రితం ఒక దారుణమైన విషాదం జరిగింది. నగరంలోని హయత్ నగర్ ప్రాంతంలోని ఒక గదిలో అద్దెకి ఉంటున్నటువంటి ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా వివరాల్లోకి వెళ్తే… రాఘవేంద్ర కాలనీ కి చెందిన మమత, గౌతమి అనే ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ చదువుతున్నారు. వారిరువురు కూడా పక్క పక్క ఇళ్లలోనే ఉంటూ తమ విద్య కొనసాగిస్తున్నారు. అంతకి మించి వారిద్దరూ కూడా మంచి స్నేహితులని చెప్పాలి. అయితే నేడు తమ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ ఇద్దరు యువతులు కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

కాగా మమత తల్లిదండ్రులు అవసరాల నిమిత్తం వేరే ఉరికి వెళ్లగా, అదే అదునుగా భావించిన ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం. అయితే మమతా సోదరుడు స్కూల్ నుండి వచ్చేసరికి ఆ ఇద్దరు కూడా పైన వేలాడుతూ కనిపించారు. స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అక్కడ వారికీ ఒక సూసైడ్ లేఖ లభించింది. కాగా అందులో… తమ కుటుంబ సబ్యులకు తాము భారంగా మారడం వల్లే ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి నిర్ణయించుకున్నామని రాసి ఉంది. కాగా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.