సీఎం జగన్‌కి సుజనా లేఖ.. ఇంట్రెస్టింగ్ సజేషన్..!

Tuesday, January 14th, 2020, 08:00:04 PM IST

ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి లేఖ రాశారు. ఏపీ రాజధాని మార్పు సరైనది కాదు అంటూ ఆనాడు ప్రతిపక్షంలో రాజధాని అమరావతి నిర్ణయాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని జగన్‌కు గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలలో కాలంలో 42 వేల కోట్ల పనులను కారణం లేకుండా ఆపారని అన్నారు.

అయితే విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటు కోసం భవనాలు వెతుకుతున్నట్టు మంత్రులు ప్రకటిస్తుండడంతో అమరావతిలో రైతులు మరింత ఆందోళన చేస్తున్నారని, రాజధాని తరలింపు ఆర్థికంగా, న్యాయపరంగా అనేక ప్రభావాలను చూపుతుందని అన్నారు. 12 శాతం భూములలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, 88 శాతం భూములను నిరుపయోగంగా వదిలేయడం సరికాదని నిజంగా గత ప్రభుత్వ హయాంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆధారాలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోమని లేఖలో పేర్కొన్నారు. ఇకపోతే మూడు రాజధానులు ఆచరణ సాధ్యం కాదని రాజధాని తరలిస్తే రైతులకు నష్టపరిహారం కింద లక్షా 89 వేల 117 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, చెట్టును రక్షిస్తే నీడనిస్తుందని, అమరావతిని రక్షిస్తే రాష్ట్రానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుందని సజేషన్ ఇచ్చారు.